షార్ లో పని చేసే ఝార్ఖండ్ వలస కార్మికుల ఆందోళన!
- రెండు వందల మంది కార్మికుల ఆందోళన
- పోలీసులను తోసేసిన కార్మికులు.. కార్మికులపై లాఠీఛార్జి
- షార్ లోపల బస్సుల, భవనాల అద్దాలు పగలగొట్టిన కార్మికులు
లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వలస కార్మికులను తిరిగి ఆయా రాష్ట్రాలకు పంపుతున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని వలస కార్మికులను కూడా ఆయా రాష్ట్రాలకు పంపుతున్నారు. అయితే, తమను మాత్రం ఎందుకు పంపడం లేదంటూ అక్కడ పనిచేస్తున్న ఝార్ఖండ్ వలస కార్మికులు ఆందోళనకు దిగారు. బీహార్ కు చెందిన వలస కార్మికులను వారి రాష్ట్రాలకు తరలించారని, తమను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రెండు వందల మంది వలస కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసులను తోసుకుంటూ పోయిన కార్మికులు, షార్ లోపల ఉన్న బస్సుల అద్దాలను, భవనాల అద్దాలను పగలగొట్టారు. ఈ క్రమంలో కార్మికులపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. షార్ లోపల నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు. ఆందోళనకు దిగిన కొందరు కార్మికులను బస్సుల్లో పోలీసులు తరలిస్తున్నట్టు సమాచారం.