చంద్రబాబు దయతో లీడరై... ఆయన్నే తిట్టిన చరిత్ర నీది: తలసానిపై జగ్గారెడ్డి ఫైర్
- తలసాని నోరు అదుపులో పెట్టుకోవాలి
- ఆయన వాడే భాష మాకు రాదు
- కేసీఆర్ దగ్గర మాట్లాడే దమ్ము ఉందా?
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ నేతల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. విమర్శలు చేసేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలని అన్నారు. చంద్రబాబు దయతో లీడరై, ఆయన దగ్గర మంత్రిగా పని చేసి, పార్టీ మారిన తర్వాత ఆయననే తిట్టిన చరిత్ర నీదని దుయ్యబట్టారు. తాను కూడా గతంలో టీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యే అయ్యానని... పార్టీ మారినా ఎప్పుడూ కేసీఆర్ ను తిట్టలేదని చెప్పారు. కేవలం ఆయన విధానాలను మాత్రమే వ్యతిరేకించానని అన్నారు.
ఎవరి ఊరికి వాడే పటేల్ అని జగ్గారెడ్డి చెప్పారు. హైదరాబాదులో తలసాని హవా నడిస్తే... సంగారెడ్డిలో తన హవా నడుస్తుందని అన్నారు. మా దగ్గర అందరూ చదువుకున్నోళ్లు ఉన్నారని... తలసాని వాడే భాష మాకు రాదని ఎద్దేవా చేశారు. తలసాని పద్ధతి మార్చుకోకపోతే ఆయన బండారం బయటపెడతానని చెప్పారు. లాక్ డౌన్ విషయంలో కూడా ప్రభుత్వానికి సహకరించామని... రాజకీయ విమర్శలు చేయలేదని జగ్గారెడ్డి చెప్పారు. ప్రభుత్వంలో కేసీఆర్ వన్ మేన్ షో చేస్తున్నారని... మంత్రులంతా డమ్మీలేనని విమర్శించారు. తలసాని వంటి మంత్రులు బయట పెద్ద మాటలు మాట్లాడతారని... కేసీఆర్ దగ్గర మాట్లాడే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు.