రిలయన్స్ ఎఫెక్ట్... లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 199 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 52 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
- 5 శాతం వరకు లాభపడ్డ హిందుస్థాన్ యూనిలీవర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ నాటి లాభాలను ముందుండి నడిపించింది. జియోలో విస్టా రూ.11,367 కోట్ల పెట్టుబడులు పెడుతోందని రిలయన్స్ ప్రకటించడంతో... ఆ సంస్థ షేర్లు దూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 199 పాయింట్లు లాభపడి 31,643కి పెరిగింది. నిఫ్టీ 52 పాయింట్లు పుంజుకుని 9,252 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (4.81%), నెస్లే ఇండియా (3.88%), టెక్ మహీంద్రా (3.87%), సన్ ఫార్మా (3.69%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.62%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-3.87%), ఎన్టీపీసీ (-3.81%), యాక్సిస్ బ్యాంక్ (-3.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.96%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.34%).