ఎప్పుడు ఆర్థిక అవసరం వచ్చినా సాయం చేస్తా... తన సిబ్బందికి హామీ ఇచ్చిన ఎన్టీఆర్
- లాక్ డౌన్ నేపథ్యంలో సిబ్బందికి సెలవు ఇచ్చిన ఎన్టీఆర్
- సిబ్బంది అందరికీ ముందే జీతాలు ఇచ్చేసిన వైనం
- ఇప్పటికే కరోనాపై పోరుకు రూ.75 లక్షల విరాళం
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ తన సిబ్బంది పట్ల ఔదార్యం ప్రదర్శించారు. తన వద్ద పనిచేసే ఉద్యోగులందరికీ ముందుగానే వేతనాలు చెల్లించి వారు ఇబ్బంది పడకుండా వ్యవహరించారు. అంతేకాదు, ఎప్పుడే ఆర్థిక అవసరం వచ్చినా తప్పకుండా సాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన వ్యక్తిగత కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి ఎన్టీఆర్ సెలవు ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే వారు ఇబ్బంది పడకుండా జీతాలు ముందే ఇచ్చేశారు. ఎన్టీఆర్ కరోనా సహాయకచర్యల కోసం మొత్తం 75 లక్షలు విరాళంగా అందించారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ.25 లక్షలు, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు.