మధ్యప్రదేశ్ లో మద్యం కొనుగోలు చేసే వారి వేలిపై సిరా గుర్తు!
- మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో అబ్కారీ అధికారుల వినూత్న ఆలోచన
- భవిష్యత్ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం
- కాంటాక్టు ట్రేసింగ్ అప్పుడు ఈ వివరాలు ఉపయోగపడతాయి
మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లాలో అబ్కారీ అధికారులు ఓ వినూత్న ఆలోచన చేశారు. మద్యం కొనుగోలు చేసిన వారి వేలిపై సిరా గుర్తువేస్తున్నారు. ఈ సందర్భంగా అబ్కారీ అధికారి అభిషేక్ తివారీ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే త్వరగా గుర్తించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
జిల్లాలోని నాన్ కంటైన్మెంట్ జోన్లలోని 50 దుకాణాలు తెరిచామని, ఆయా దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వారి పేరు, చిరునామా, మొబైల్ నెంబర్లను నమోదు చేసుకుంటున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కాంటాక్టు ట్రేసింగ్ అవసరమైతే ఈ వివరాలు ఉపయోగపడతాయని అన్నారు.