మరో 86 కంపెనీలను గుర్తించాం.. వీటిని కూడా పరిశీలిస్తాం: మంత్రి గౌతమ్ రెడ్డి
- కంపెనీలోని ట్యాంకులపై సమీక్ష నిర్వహించాం
- స్టిరీన్ వాయువు ఎక్కువ శాతం గాల్లో ఉండదు
- 48 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది
విశాఖలో గ్యాస్ లీకైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులు, నిపుణులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రమాదంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదానికి గురైన ట్యాంక్, ఇతర ట్యాంకుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించామని చెప్పారు.
స్టిరీన్ వాయువు గాల్లో తక్కువ మోతాదులోనే ఉందని... అందువల్ల భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని చెప్పారు. స్టిరీన్ ఎక్కువ శాతం గాల్లో ఉండదని... వెంటనే కిందకు వచ్చేస్తుందని తెలిపారు. విశాఖలో చోటుచేసుకున్న ప్రమాదంతో... రాష్ట్ర వ్యాప్తంగా మరో 86 కంపెనీలను గుర్తించామని చెప్పారు. ఈ కంపెనీలన్నింటిలో భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తామని... ఆ తర్వాతే ప్రారంభానికి అనుమతులు ఇస్తామని తెలిపారు.