వైజాగ్ ఘటన.. సీఎం జగన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం: కన్నా లక్ష్మీనారాయణ

  • న్యాయ విచారణ జరిపించి.. దోషులను శిక్షించాలి
  • ఆ పని చేస్తే శ్రామిక వర్గాల్లో ధైర్యం పెరుగుతుంది
  • బాధితులు కోలుకునే వరకూ మెరుగైన వైద్యం అందించాలి
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధితుల విషయమై ఏపీ సీఎం జగన్ తీసుకున్న చర్యలను  స్వాగతిస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని కోరారు.  తద్వారా శ్రామిక వర్గాల్లో ధైర్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో బాధితులు పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 కాగా, ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా, చిన్న గాయాలతో ఇబ్బంది పడి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన వారికి ఒక్కొక్కరికి  రూ.25,000 చొప్పున,  ఆసుపత్రిలో రెండుమూడ్రోజుల పాటు చికిత్స పొందిన వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున, వెంటిలేటర్ ద్వారా చికిత్స తీసుకున్నవారికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.


More Telugu News