కరోనా సోకిన వృద్ధులంటే అంత చులకనా..?: ఐరాస ప్రధాన కార్యదర్శి ఆగ్రహం
- రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు
- కొన్ని దేశాల్లో వృద్ధులకు చికిత్స అందించలేమంటున్న ఆసుపత్రులు!
- ఎవరికైనా చికిత్స అందించాల్సిందేనన్న ఆంటోనియో గుటెరస్
కొన్నిదేశాల్లో కరోనా రోగుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. దాంతో కరోనా సోకిన వృద్ధులకు వైద్యం అందించలేమని కొన్ని దేశాల్లో ఆసుపత్రి వర్గాలు నిరాకరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
దీనిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్రంగా స్పందించారు. కరోనా వైరస్ కు గురైన వృద్ధులను ఎంతో చులకనగా చూస్తున్నట్టు తెలుస్తోందని, ఇది ఎంతమాత్రం సహించరానిదని స్పష్టం చేశారు. వృద్ధులకైనా, మరెవరికైనా వైద్య సేవలు అందించాల్సిందేనని అన్నారు.
అంతేకాకుండా, కొన్నిదేశాల నుంచి వలస వచ్చిన విదేశీయుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని, నిరాశ్రయులకు వైద్య సేవలు అందించడం పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారని గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలోనూ విధులు నిర్వర్తిస్తున్న పాత్రికేయులు, వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి ద్వేషపూరిత వాతావరణానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.