వెంటనే రూ.50 కోట్లు డిపాజిట్ చేయండి.. గ్యాస్ లీకేజీపై ఎల్‌జీ పాలిమర్స్‌కు ఎన్జీటీ నోటీసులు
- కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలకు కూడా నోటీసులు
- కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి కూడా అందిన నోటీసులు
- వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశం
విశాఖపట్నంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా సంస్థకు నోటీసులు జారీ చేసింది. గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన నష్టానికి గానూ వెంటనే ప్రాథమికంగా రూ.50 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది.
ఎల్జీ పాలిమర్స్ సంస్థకే కాకుండా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలకు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి కూడా ఎన్జీటీ నోటీసులు జారీ చేసి, వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశించింది. కాగా, గ్యాస్ లీకేజీకి ప్రభావితమైన ఆర్ఆర్ పురంలో పెద్ద ఎత్తున పశువులు, పక్షులు, చెట్లు కూడా నాశనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా, గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ అధ్యక్షతన ఈ కమిటీ విచారణ జరిపి నివేదికను అందిస్తుంది. ఈ కమిటీలో సభ్యుడిగా విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ కూడా ఉన్నారు.