రియాజ్ నైకూ హతమవడంతో సైఫుల్లాకు బాధ్యతలు.. వేట మొదలుపెట్టిన భద్రతాబలగాలు!
- రెండు రోజుల క్రితం నైకూను మట్టుబెట్టిన బలగాలు
- కొత్త కమాండర్ సైఫుల్లా కోసం గాలింపు
- నాలుగు నెలల్లో 70కి పైగా ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్ హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను రెండు రోజుల క్రితం భారత భద్రతాబలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిజ్బుల్ కొత్త కమాండర్ గా సైఫుల్లాను నియమించారు. ఈ సమాచారం అందిన వెంటనే సైఫుల్లా కోసం భద్రతా బలగాలు వేట మొదలుపెట్టాయి.
సైఫుల్లా దక్షిణ కశ్మీర్ లో ఇంతకాలం ఉన్నాడు. ఏ ప్లస్ ప్లస్ కేటగిరీలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాదిగా పేరుంది. భద్రతా బలగాల కాల్పుల్లో గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స అందించే బాధ్యతలను ఇంతకాలం సైఫుల్లా చూసుకున్నాడు. మరోవైపు, గత నాలుగు నెలల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.