సిక్స్ ప్యాక్ తో కనిపించనున్న నాని!

  • నాని తాజా చిత్రంగా రూపొందిన 'వి'
  • శివ నిర్వాణ దర్శకత్వంలో సెట్స్ పైకి 'టక్ జగదీశ్'
  • మైత్రీ బ్యానర్ పై 'శ్యామ్ సింగ రాయ్'
మొదటి నుంచి కూడా నాని కథాకథనాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. లుక్స్ పరంగా పెద్దగా మార్పు చూపించడానికి ఆయన ఆసక్తిని కనబరచడు. పక్కింటి అబ్బాయి మాదిరిగా కనిపించడానికే ఆయన ఉత్సాహాన్ని చూపుతాడు.  అలాంటి నాని 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నట్టు చెప్పుకుంటున్నారు.

నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వి' ముస్తాబవుతోంది. ఆ తరువాత ఆయన శివ దర్శకత్వంలో 'టక్ జగదీశ్' సినిమాను పూర్తిచేయనున్నాడు. ఆ తరువాత రాహుల్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' చేయనున్నాడు.  ఈ సినిమాలోనే నాని సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్న నాని, సిక్స్ ప్యాక్  కోసం గట్టిగానే వర్కౌట్స్ చేస్తున్నాడని చెబుతున్నారు.

చూస్తుంటే నాని ఈ సారి సాహసమే కాదు .. పెద్ద ప్రయోగం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేసేశారట. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, లాక్ డౌన్ తరువాత సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.


More Telugu News