ముంబైలో ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ దుకాణాలు తెరిచేందుకు అనుమతి
- అత్యవసర విభాగంలో వినియోగించే పరికరాలు కొన్ని పని చేయట్లేదు
- వాటికి రిపేర్ చేయించాల్సిన అవసరం ఉంది
- అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నాం: బీఎంసీ కమిషనర్
ముంబయిలో ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ దుకాణాలు తెరిచేందుకు ముంబయి మహానగర పాలిక (బీఎంసీ) అనుమతినిచ్చింది. ఈ మేరకు బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పర్ దేశీ తెలిపారు. అత్యవసర విభాగంలో ఉపయోగించే వైద్య పరికరాలు, కంప్యూటర్లు, వాహనాలు, ఇతర యంత్రాలు కొన్ని పనిచేయడం లేదని, వాటికి రిపేర్ చేయించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.