కాసేపట్లో అధికారులతో ఏపీ సీఎం జగన్ కీలక భేటీ
- తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షలు
- కరోనాపై కాసేపట్లో భేటీ ప్రారంభం
- మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు అధికారులతో సాయంత్రం వరకు సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉండనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణ చర్యలపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాసేపట్లో ఆయన అధికారులతో భేటీ కానున్నారు.
ఈ సమావేశం అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు. విశాఖపట్నంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో గ్యాస్ లీక్ ఘటనపై కూడా జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అధికారులు సమన్వయంతో అక్కడి పరిస్థితులు పర్యవేక్షించడానికి జగన్ సూచనలు చేయనున్నారు. బాధితులకు అందాల్సిన ఆర్థిక సాయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.