ఔరంగాబాద్ రైలు ప్రమాద ఘటనపై ఎంతో బాధపడ్డాను: చంద్రబాబునాయుడు
- మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి
- ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి
- రైలు ప్రమాద ఘటనపై స్పందిస్తూ చందబ్రాబు ట్వీట్
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ - నాందేడ్ మార్గంలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఘటన సమాచారం తెలిసి తాను ఎంతో బాధపడ్డానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, ఈ రైలు ప్రమాదంలో 16 మంది మరణించినట్టు సమాచారం. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులుగా తెలుస్తోంది.