'లూసిఫర్' తెలుగు రీమేక్ లో భారీ మార్పులు

  • మలయాళంలో ప్రశంసలు అందుకున్న 'లూసిఫర్'
  • చరణ్ చేతికి తెలుగు రీమేక్ హక్కులు
  •  చిరూ క్రేజ్ కి తగినట్టుగా కథలో మార్పులు  
మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా క్రితం ఏడాది మార్చిలో వచ్చిన 'లూసిఫర్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన చిత్రంగా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.  అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో, చరణ్ రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడు. చిరంజీవి కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించడానికి రంగంలోకి దిగాడు.

ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దర్శకుడు సుజీత్ కి అప్పగించారు. మలయాళంలో మోహన్ లాల్ కి వున్న క్రేజ్ వేరు .. అక్కడి ప్రేక్షకుల అభిరుచి వేరు. అందువలన కథను తెలుగు నేటివిటీకి దగ్గరగా .. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా తీసుకురావలసిన అవసరం వుంది. అందువలన ఆ విషయాలపై దృష్టిపెట్టిన సుజీత్, కథలో భారీ మార్పులు చేస్తున్నాడని అంటున్నారు.

చిరంజీవి క్రేజ్ కి తగినట్టుగా .. ఆ పాత్ర స్వరూప స్వభావాలను ఆయన మరింతగా తీర్చిదుద్దుతున్నాడని చెబుతున్నారు.  ఇక చిరంజీవి .. కొరటాల దర్శకత్వంలో చేస్తున్న 'ఆచార్య' దీపావళి పండుగకి గానీ .. క్రిస్మస్ కి గాని విడుదల చేసే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.


More Telugu News