దేశంలో కరోనా అప్ డేట్: 24 గంటల్లో 3,390 మందికి పాజిటివ్ నిర్ధారణ
- గత 24 గంటల్లో భారత్‌లో 103 మంది మృతి
- మృతుల సంఖ్య మొత్తం 1,886
- మొత్తం కేసులు 56,342
- ఆసుపత్రుల్లో 37,916 మందికి చికిత్స
భారత్‌లో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 3,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,886 కి చేరింది.
గత 24 గంటల్లో దేశంలో 3,390 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 56,342కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 16,539 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో 37,916 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 17, 974 కరోనా కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 7,012, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409 కేసులు నమోదయ్యాయి.