ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ మూవీ
- 'ఆర్ ఆర్ ఆర్'తో బిజీగా ఎన్టీఆర్
- తదుపరి సినిమా త్రివిక్రమ్ తో
- ప్రశాంత్ నీల్ సినిమా కోసం రెండేళ్లు కేటాయించిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అందుకు సంబంధించిన పనులతో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ తరువాత సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్నాడు. ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వుండనుందనేది తాజా సమాచారం. డిఫరెంట్ లుక్ తో .. చాలా పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ చూపించనున్నట్టు తెలుస్తోంది. 2021 చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెడతారట. 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ పై .. ఆయన తయారు చేసిన కథపై నమ్మకంతో ఎన్టీఆర్ రెండేళ్ల పాటు డేట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు.