రియాజ్ నైకూ సంతాప సభలో భారత్ కు వార్నింగ్ ఇచ్చిన హిజ్బుల్ చీఫ్
- హిజ్బుల్ టాప్ కమాండర్ నైకూను మట్టుబెట్టిన భారత బలగాలు
- కశ్మీర్ ఒక నిప్పురవ్వ అన్న హిజ్బుల్ చీఫ్ సలాహుద్దీన్
- దావానలంలా మారి మొత్తాన్ని దహించి వేస్తుందంటూ వార్నింగ్
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను భారత భద్రతాబలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సంస్థకు భారత్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ చీఫ్, పాక్ లో తలదాచుకున్న సయ్యద్ సలాహుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నైకూ సంతాపసభలో ఆయన మాట్లాడుతూ, కశ్మీర్ అంశం ఒక నిప్పురవ్వ అని అన్నారు. అది దావానలంలా మారి మొత్తాన్ని దహించివేస్తుందని ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు.
యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ పేరిట పాక్ అనుకూల శక్తులకు సలాహుద్దీన్ నాయకత్వం వహిస్తున్నాడు. 2017లో అతన్ని అమెరికా గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అయితే, ఐక్యరాజ్యసమితి మాత్రం సలాహుద్దీన్ ను టెర్రరిస్టుగా గుర్తించలేదు. దీన్ని సాకుగా తీసుకుని అతనిపై చర్యలు తీసుకునేందుకు పాక్ నిరాకరిస్తూ వస్తోంది.