కర్ణాటకలో పోటెత్తుతున్న మందుబాబులు... రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

  • దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై ఆంక్షల తొలగింపు
  • కర్ణాటకలో తొలి రెండ్రోజుల్లో రూ.242 కోట్ల ఆదాయం
  • ఇవాళ ఒక్కరోజే రూ.165 కోట్లు
దేశవ్యాప్తంగా మద్యం విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేయడంతో వైన్ షాపుల వద్ద భారీ కోలాహలం నెలకొంది. ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో నిలబడి మద్యం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్న మందుబాబులే కనిపిస్తున్నారు. కాగా, మద్యం అమ్మకాలు ప్రారంభమై మూడు రోజులు కాగా, ఇవాళ ఒక్కరోజే కర్ణాటక భారీస్థాయిలో ఆదాయం రాబట్టింది.

 నేడు కర్ణాటక మొత్తమ్మీద రూ.165 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. తొలి రెండు రోజుల్లోనే కర్ణాటకలో రూ.242 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయంటే మందుబాబుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం విక్రయాలు ప్రారంభమైన రోజే కర్ణాటకలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. బెంగళూరులోని కొన్ని వైన్ షాపుల వద్ద యువతులు కూడా క్యూలైన్లలో దర్శనమిచ్చారు.


More Telugu News