ఎయిర్ పోర్టులో జగన్‌ను కలిసిన ఎల్జీ కంపెనీ ప్రతినిధులు

  • అమరావతికి వెళ్లేముందు సీఎంను కలిసిన ప్రతినిధులు
  • గ్యాస్ లీకేజీపై సీఎంకు వివరణ
  • లీకేజీని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను వివరించిన వైనం
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ కు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రిని ఈ కంపెనీకి చెందిన అధికారుల బృందం కలిసింది. బాధితులను పరామర్శించి తిరిగి అమరావతికి వెళ్లేముందు జగన్ ను వీరు విమానాశ్రయంలో కలిశారు. గ్యాస్ లీక్ కావడానికి గల కారణాలను ఈ సందర్బంగా వివరించారు. లీకేజీని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను కూడా ముఖ్యమంత్రికి వివరించారు.

మరోవైపు, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం అందిస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న అంశంపై క‌మిటీ అధ్యయనం చేస్తుంద‌ని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు అలారమ్‌ మోగాలని, కానీ అలా జరగలేదని జగన్‌ పేర్కొన్నారు. అధికారులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేశార‌ని అన్నారు.


More Telugu News