ఈ ఘటన తీవ్రత తెలిసే కొద్దీ ఆందోళన చెందాను: పవన్ కల్యాణ్
- ఉదయం ఐదున్నర గంటల నుంచే సమాచారం అందింది
- గ్యాస్ లీకేజ్ ఘటన చాలా కలచివేసింది
- మా నాయకులు వెంటనే స్పందించారు
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన తనను చాలా కలచివేసిందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఈరోజు ఉదయం ఐదున్నర గంటల నుంచే తనకు అందిందని చెప్పారు.
స్థానికంగా ఉన్న ‘జనసేన’ నాయకులు సంబంధిత వీడియోలను తమ పార్టీ జనరల్ సెక్రటరీకి పంపించారని, అక్కడి నుంచి తనకు చేరాయని అన్నారు. ఈ ఘటన తీవ్రత తెలిసే కొద్దీ ఆందోళన చెందానని, దారి పొడవునా కింద పడిపోయిన మహిళలు, చిన్నారులతో పాటు చనిపోయిన మూగజీవాలు ఉండటం తనకు చాలా ఆవేదన కల్గించిందని అన్నారు.
ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే జనసేన పార్టీ నాయకులు స్పందించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఉపశమనం కలిగించిందని అన్నారు. ఇదే స్ఫూర్తితో బాధితులకు అండగా నిలబడాలని తమ నాయకులకు పిలుపు నిచ్చారు.