జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమను ఎలా ఏర్పాటు చేశారు?: ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న
- వైజాగ్ లో గ్యాస్ లీకై 9 మంది మృతి
- సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
నగరంలో జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమ ఎలా ఏర్పాటు చేశారంటూ ఏపీ హైకోర్టు వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను అమికస్ క్యూరీగా నియమించింది.
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకైన ఘటనలో తొమ్మిది మంది మరణించడం తెలిసిందే. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఓ ఘటనను సుమోటోగా స్వీకరించడం అంటే ప్రభుత్వ వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్నామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.