గ్యాస్ లీకేజీపై ఎల్‌జీ పాలిమర్స్ స్పందన

  • గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చింది
  • ఎలా లీక్ అయిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం
  • ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం
విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురం వద్ద ఉన్న ప్లాంటు నుంచి గ్యాస్ లీక్ కావడంలో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్ స్పందించింది. ప్రస్తుతం గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చిందని తెలిపింది. లాక్ డౌన్ కారణంగా ప్లాంట్ ను తాత్కాలికంగా నిలిపేశామని పేర్కొంది. లాక్ డౌన్ సడలింపులతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహకాలు చేసుకుంటున్న సమయంలో... ట్యాంక్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్టు నైట్ షిఫ్ట్ లో ఉన్న ఓ కార్మికుడు గుర్తించాడని తెలిపింది.

గ్యాస్ ఎలా లీక్ అయిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఎల్జీ చెప్పింది. గ్యాస్ లీకేజీ వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపింది. ప్రజలు, ఉద్యోగులను రక్షించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని చెప్పింది. లీక్ అయిన వాయువును పీల్చినప్పుడు వికారంతో పాటు, మైకం ఆవరిస్తుందని తెలిపింది. ప్రమాదం జరగడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని చెప్పింది.


More Telugu News