విజయసాయిరెడ్డిని దింపేసి.. ఆళ్ల నానిని కారెక్కించుకున్న జగన్.. వీడియో ఇదిగో!
- తాడేపల్లి నుంచి వైజాగ్ వెళ్లేముందు ఆసక్తికర ఘటన
- జగన్ కారులో కూర్చున్న విజయసాయి
- ఆ వెంటనే కిందకు దిగిన వైనం
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. విశాఖలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు జగన్ అమరావతి నుంచి వైజాగ్ వెళ్లారు. అయితే తాడేపల్లిలోని తన అధికారిక నివాసం నుంచి బయల్దేరేటప్పుడు చోటుచేసుకున్న సన్నివేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
విమానాశ్రయానికి బయల్దేరేందుకు జగన్ కారెక్కారు. ముందు సీటులో జగన్ కూర్చున్న వెంటనే... వెనక సీటులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూర్చున్నారు. అయితే క్షణాల వ్యవధిలోనే కారు నుంచి విజయసాయి దిగిపోయారు. మంత్రి ఆళ్లనాని వాహనంలోకి ఎక్కారు. వెంటనే వాహనం అక్కడి నుంచి బయల్దేరింది.
విజయసాయి కారు నుంచి ఎందుకు దిగిపోయారనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. వైజాగ్ పార్టీ వ్యవహారాలన్నీ విజయసాయి చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైజాగ్ కు జగన్ తో పాటు వెళ్లేందుకు ఆయన కూడా కారెక్కారు. అయితే, ఆ వెంటనే విజయసాయి కిందకు దిగిపోవడం... మంత్రి ఆళ్ల నాని కారులోకి ఎక్కడం జరిగింది. ఈ వ్యవహారం ప్రజల ఆరోగ్యానికి సంబంధించినది కావడంతో... తనతో పాటు ఆరోగ్యమంత్రిని జగన్ తీసుకెళ్లారని తెలుస్తోంది.