సినిమాల్లోకి వెళ్లాలని వుందంటే అంతా నవ్వారు .. బాధనిపించింది: హైపర్ ఆది
- సినిమాలపై ఆసక్తి ఉండేది
- 'జబర్దస్త్' గుర్తింపు తెచ్చింది
- ఆ రోజును మరిచిపోలేనన్న హైపర్ ఆది
హైపర్ ఆది ఒక వైపున బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే, మరో వైపున వెండితెరపై నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక బాధాకరమైన సంఘటనను గురించి ప్రస్తావించాడు.
"నేను ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగాను .. బీటెక్ పూర్తి చేశాను. మొదటి నుంచి సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. ఒక సందర్భంలో నా చుట్టూ వున్న వాళ్ల దగ్గర నా మనసులోని మాటను చెప్పాను. నా లక్ష్యం ఏమిటో వినగానే వాళ్లంతా నవ్వేశారు. ఆ క్షణంలో నాకు చాలా బాధ కలిగింది. నేనేంటో సాధించి చూపించాలని అప్పుడే అనుకున్నాను.
ఇక ఆ పట్టుదలతోనే హైదరాబాద్ వచ్చాను .. 'జబర్దస్త్' లో అవకాశాన్ని సంపాదించుకున్నాను. ఈ కామెడీ షో ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. రెండేళ్ల తరువాత నేను మా ఊరు వెళ్లాను. ఆ సమయంలో ఊళ్లో వాళ్లు నా పట్ల చూపిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేను. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా నన్ను చూడటానికి మా ఊరు వచ్చారు. గుంపులుగా వచ్చిన జనాలను చూసి నాకు ఆనందాశ్చర్యాలు కలిగాయి. అప్పటి నుంచి కెరియర్ పరంగా నేను మరింత కష్టపడటం మొదలుపెట్టాను" అని చెప్పుకొచ్చాడు.