ఏపీలో మరో 56 మందికి కరోనా.. విజయనగరంలో తొలిసారిగా పాజిటివ్‌ కేసుల నమోదు!

  • 24 గంటల్లో 8,087 శాంపిళ్ల పరీక్ష
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,833
  • 780 మంది డిశ్చార్జ్  
  • కర్నూలులో మొత్తం కేసులు 540
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,087 శాంపిళ్లను పరీక్షించగా 56 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,833గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 780 మంది డిశ్చార్జ్ కాగా, 38 మంది మరణించారని వివరించింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,015గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, గుంటూరులో 10, కడపలో 6, కృష్ణాలో 16, కర్నూలులో 7, నెల్లూరులో 4, విశాఖపట్నంలో 7 కేసులు నమోదయ్యాయి.

విజయనగరంలో తొలిసారి కేసులు..

విజయనగరంలో నిన్నటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్న విషయం తెలిసిందే. ఆ జిల్లాలో తొలిసారి కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో విజయ నగరంలో మొత్తం 3 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలులో మొత్తం కేసులు 540కి చేరాయి.

జిల్లాల వారీగా వివరాలు...            
             

గ్రాఫ్ రూపంలో..               


More Telugu News