నిఖిల్ వల్లనే ఇంతవరకూ వచ్చాను: దర్శకుడు చందూ మొండేటి
- 'కార్తికేయ' విషయంలో కొంతమంది భయపెట్టారు
- నిఖిల్ నన్ను నమ్మి రంగంలోకి దిగాడు
- స్క్రిప్ట్ పై కసరత్తు జరుగుతోందన్న చందూ
నిఖిల్ కథానాయకుడిగా చాలా కాలం క్రితం వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఇటీవలే దర్శకుడు చందూ మొండేటి రంగంలోకి దిగాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగు వాయిదా పడటంతో, ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'కార్తికేయ' విడుదలకి ముందు ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. అందువలన అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ కారణంగా 'కార్తికేయ 2'పై సహజంగానే అంచనాలు భారీగా వున్నాయి. ఆ అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత నాపై వుంది. 'కార్తికేయ' సినిమా సమయంలో సబ్జెక్ట్ విషయంలో నన్ను చాలామంది భయపెట్టారు. ఒక్క నిఖిల్ మాత్రం నన్ను .. నేను తయారు చేసిన కథను నమ్మాడు. ఆయన అవకాశం ఇవ్వడం వల్లనే ఈ రోజున నేను ఈ స్థానంలో వున్నాను. నాపై ఆయనకి గల నమ్మకాన్ని ఈ సారి కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. లాక్ డౌన్ కారణంగా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఈ సినిమా స్క్రిప్ట్ పైనే మరింత కసరత్తు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు.