విశాఖ ప్రమాద ఘటనపై విచారణ జరుపుతాం: మంత్రి కన్నబాబు

  • ఎల్జీ పరిశ్రమ గతంలో విశాఖ శివార్లలో ఉండేది
  • నగర విస్తరణ తర్వాత సమస్యలు వచ్చాయి
  • బాధితుల తరలింపుకు అంబులెన్స్ లు సిద్దం
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టిరీన్ గ్యాస్ లీకేజ్ ప్రమాద ఘటనపై విచారణ జరుపుతామని ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పరిశ్రమ గతంలో విశాఖ శివార్లలో ఉండేదని, నగర విస్తరణ తర్వాత ఇబ్బందులు వచ్చాయని అన్నారు. ఈ ఘటనలో బాధితులు ఎవరైతే ఆసుపత్రికి వెళ్లారో వారికి ప్రమాదం తప్పిందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేయమని ఆదేశించామని, బాధితులను తరలించేందుకు అంబులెన్స్ లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

కాగా, ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, రబ్బర్ తయారీలో స్టిరీన్ గ్యాస్ వినియోగిస్తారు. ఈ పరిశ్రమ నుంచి గతంలో కూడా గ్యాస్ లీకైన దాఖలాలు ఉన్నాయి. ఈ విషయమై అధికారులకు, నేతలకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.


More Telugu News