విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై జగన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

  • వివరాలు అడిగి తెలుసుకున్న మోదీ
  • పూర్తి సహాయం అందిస్తామన్న ప్రధాని
  • ఘటనా స్థలిలో మంత్రి అవంతి పర్యటన
విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై మోదీ పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు. పూర్తి సాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఆయన హోం శాఖతో పాటు జాతీయ విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. ఈ గ్యాస్‌లీక్‌ ఘటనలో బాధితుల్లో చాలా మంది ఆర్‌ఆర్‌ వెంకటాపురం వాసులే ఉన్నట్లు మోదీ తెలుసుకున్నారు.

కాగా, గ్యాస్‌ లీక్‌ జరిగిన ప్రాంతంలో రంగంలోకి దిగిన మునిసిపల్ సిబ్బంది.. ప్రమాద తీవ్రత తగ్గించేందుకు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఘటనాస్థలికి పరిశ్రమ నిపుణులను అధికారులు రప్పించారు. ప్రభావిత గ్రామాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్‌, కలెక్టర్ వినయ్ చంద్ పర్యటిస్తున్నారు.


More Telugu News