1910 కాలానికి ప్రేక్షకులను తీసుకెళ్లనున్న శర్వానంద్

  • శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'శ్రీకారం'
  • తదుపరి సినిమా చందూ మొండేటితో
  • ప్రేమకథా నేపథ్యంలో సాగే సినిమా  
కొంతకాలంగా శర్వానంద్ వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన 'శ్రీకారం' సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా పనులు నిలిచిపోయాయి.  గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా, తప్పకుండా తనకి విజయాన్ని తెచ్చిపెడుతుందని శర్వానంద్ భావిస్తున్నాడు.  

ఈ సినిమా తరువాత ఆయన చందూ మొండేటితో కలిసి ఒక ప్రేమకథా చిత్రం కోసం సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ కథలో కొంత భాగం 1910 కాలంలో నడుస్తుందట. అక్కడి నుంచి 2021కి కథ చేరుకుంటుందని అంటున్నారు. అందువలన కథ పూర్తి వైవిధ్యభరితంగా ఉంటుందని చెబుతున్నారు.

కథాకథనాల పరంగా .. కాస్ట్యూమ్స్ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం చందూ మొండేటి 'కార్తికేయ 2' సినిమా పనులతో బిజీగా వున్నాడు. ఆ సినిమా విడుదలైన తరువాత ఆయన శర్వానంద్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడట. కొత్తదనం కోసం శర్వానంద్ చేసే ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.


More Telugu News