విశాఖ గ్యాస్‌ లీక్‌పై కాసేపట్లో ప్రధాని మోదీ అత్యవసర సమావేశం

  • జాతీయ విపత్తు నియంత్రణ సంస్థ అధికారులతో భేటీ
  • పలు సూచనలు చేయనున్న ప్రధాని
  • ఎన్‌డీఎంఏ అధికారులతో మాట్లాడానన్న అమిత్ షా
విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ విపత్తు నియంత్రణ సంస్థ అధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. వారికి మోదీ పలు సూచనలు చేయనున్నారు. ఇప్పటికే ఎన్‌డీఎంఏ అధికారులు సహాయ చర్యల్లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

కాగా, గ్యాస్‌ లీక్‌ ఘటనపై స్పందించిన హోం మంత్రి అమిత్‌ షా ట్వీట్ చేశారు. 'విశాఖ ఘటన నన్ను కలచివేసింది. నేను ఎన్‌డీఎంఏ అధికారులతో పాటు సంబంధిత ఇతర అధికారులతోనూ మాట్లాడాను. అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాము. విశాఖపట్నం ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను' అని అమిత్‌ షా అన్నారు.


More Telugu News