విశాఖ గ్యాస్ లీక్ ఘటన: తలుపులు బద్దలుకొట్టి ఇళ్లలోకి వెళ్తున్న ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది
- ఇప్పటివరకు 200 మందికి పైగా అస్వస్థత
- అవసరమైన మేరకు అందుబాటులో ఆక్సిజన్ సిలిండర్లు
- అన్ని రకాలుగా ఆదుకుంటున్నామన్న మంత్రి అవంతి
- రంగంలోకి నౌకాదళం
విశాఖ సమీపంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటన అలజడి రేపుతోంది. ఆ ప్రాంతంలో ఇళ్లలోనూ ప్రజలు స్పృహ తప్పి పడిపోతున్నట్లు తెలిసింది. దీంతో తలుపులు బద్దలు కొట్టి ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఇళ్లలోకి వెళుతున్నారు. రసాయన వాయువు లీకేజీ వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్ వినయ్ చంద్ అధికారికంగా ప్రకటన చేశారు.
విష వాయువును పీల్చడం వల్ల ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని వివరించారు. ఇప్పటివరకు 200 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అవసరమైన మేరకు ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో సహాయ చర్యల్లో నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. అంబులెన్సులు, మెడికల్ కిట్‌లతో వెంకటాపురం చేరుకుంది.