తెలంగాణలో దుమ్మురేపిన మద్యం అమ్మకాలు... ఏపీ రికార్డు బద్దలు!
- లాక్ డౌన్ తర్వాత రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
- ఏపీలో తొలిరోజు రూ.. 67 కోట్ల అమ్మకాలు
- తెలంగాణలో ఫస్ట్ డే సేల్స్ రూ. 90 కోట్లు
లాక్ డౌన్ తర్వాత దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఏపీలో మొదటి రోజు ఏకంగా రూ. 67 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయనే వార్తలతో జనాలు షాక్ కు గురయ్యారు. ఆ రికార్డును తెలంగాణ అధిగమించింది.
తెలంగాణలో ఈ రోజు లిక్కర్ షాపులు తెరుచుకోవడంతో, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలు జరిగాయి. షాపులను తెరవకముందే జనాలు బారులుతీరారు. సరాసరిన 16 శాతం వరకు మద్యం ధరలను పెంచినప్పటికీ మందుబాబులు ఏమాత్రం తగ్గలేదు. దాంతో, రికార్డు స్థాయిలో ఈరోజు రూ. 90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారులు తెలిపారు.