ప్రజల ప్రయాణాలకు సంబంధించి కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు

  • ప్రజా రవాణాను కొన్ని మార్గదర్శకాలతో ప్రారంభించొచ్చు
  • చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి
  • కరోనాపై భారత్ విజయం సాధిస్తుంది
లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వలస కూలీలు, కార్మికులు, విద్యార్థుల ప్రయాణాలకు మాత్రమే ప్రస్తుతం వెసులుబాటు ఉంది. మిగిలిన జనాలు మాత్రం ఎక్కడివారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రజలకు ఊరట కలిగించే వార్తను తెలిపారు. మార్చ్ 24వ తేదీ నుంచి నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థను కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలతో ప్రారంభించవచ్చని ఆయన చెప్పారు.

భారత బస్సులు, కార్ల ఆపరేటర్ల సమాఖ్య సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గడ్కరీ ప్రసంగించారు. రవాణా, జాతీయ రహదారుల పునరుద్ధరణ ప్రజలకు భరోసాను కల్పిస్తుందని చెప్పారు. అయితే, అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. చేతులు కడుక్కోవడం, భౌతికదూరాన్ని పాటించడం వంటివి తప్పనిసరి అని చెప్పారు. కరోనాపై, ఆర్థికమాంద్యంపై భారత్ విజయం సాధిస్తుందని చెప్పారు.


More Telugu News