చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలి: ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ

  • కరోనా కారణంగా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో తెలుగువారు చిక్కుకుపోయారు
  • వారి గురించి ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
  • కేంద్రంతో చర్చించి ఏపీకి షెడ్యూల్ ఫ్లైట్స్ ఉండేలా యత్నించాలి
కరోనా కారణంగా ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో తెలుగువారు చిక్కుకుపోయారని... వారందరినీ సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. విదేశాల నుంచి రావాల్సిన వారి గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీ అభివృద్ది కోసం విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఎంతో తోడ్పాటును అందించారని... ఇప్పుడు వారికి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మన రాష్ట్రానికి షెడ్యూల్ ఫ్లైట్స్ ఉండేలా యత్నించాలని సూచించారు.

తమ ప్రజలను విదేశాల నుంచి రప్పించేందుకు కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ప్రత్యేక విమాన సర్వీసులను ఏర్పాటు చేశాయని చంద్రబాబు చెప్పారు. కేరళ 15 షెడ్యూల్ ఫ్లైట్స్, తమిళనాడు 11 ఫ్లైట్స్ ఏర్పాటు చేశాయని తెలిపారు. గతంలో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారిని ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాము ఎలా తీసుకొచ్చామనే విషయాన్ని గుర్తు చేస్తున్నామని చెప్పారు.


More Telugu News