ఎన్నికల సమయంలో నా గురించి పుకార్లు పుట్టించారు: పూనంకౌర్
- 'జల్సా' సినిమాలో అవకాశం దక్కకపోవడంతో వేదనకు గురయ్యానని ప్రచారం చేశారు
- అవన్నీ తప్పుడు వార్తలు
- దాసరి గారితో తప్ప మరే దర్శకుడితో పని చేయాలని కలలు కనలేదు
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ పూనం కౌర్ ది ఒక ప్రత్యేకమైన చరిత్ర అని చెప్పుకోవచ్చు. సినిమాల్లో పెద్దగా సక్సెస్ సాధించకపోయినా... ఇతర వివాదాస్పద అంశాల కారణంగా అందరి కంటే ఎక్కువ పాప్యులర్ అయింది.
సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు బాంబుల్లా పేలాయి. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' సినిమా విషయంలో కూడా ఆమె పేరు వినిపించింది. తాజాగా దివంగత దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా 'జల్సా' గురించి పూనం ప్రస్తావించింది.
గత ఎన్నికల సమయంలో తన గురించి అనేక పుకార్లు వినిపించాయని పూనం చెప్పింది. 'జల్సా' సినిమాలో అవకాశం దక్కలేదని తాను ఎంతో వేదనకు గురైనట్టు ప్రచారం చేశారని... అవన్నీ తప్పుడు వార్తలని తెలిపింది. ఒక్క దాసరి గారి దర్శకత్వంలో తప్ప... మరే ఇతర డైరెక్టర్ తో పని చేయాలని తాను కలలు కనలేదని స్పష్టం చేసింది.