మళ్లీ దర్శకత్వం వైపే మొగ్గు చూపుతున్న వక్కంతం వంశీ
- కథారచయితగా మంచి పేరు
- మరో కథపై జరుగుతున్న కసరత్తు
- అల్లు అర్జున్ కి వినిపించే ప్రయత్నాలు
వక్కంతం వంశీ మంచి కథా రచయిత .. 'కిక్' ... 'రేసు గుర్రం' .. 'టెంపర్' సినిమాలు ఆయనలోని రైటర్ ను పూర్తిస్థాయిలో ఆవిష్కరిస్తాయి. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ, నా పేరు సూర్య' సినిమాతో దర్శకుడిగా మారాడు. యాక్షన్ .. ఎమోషన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆయన రూపొందించిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేక చతికిల పడిపోయింది.
ఇక ఆయన దర్శకత్వం జోలికి వెళ్లకుండా కథలపైనే దృష్టి పెడతాడని అంతా అనుకున్నారు. తమ కోసం విభిన్నమైన కథలను సిద్ధం చేసిపెట్టమని చాలామంది హీరోలు వక్కంతం వంశీతో చెప్పారట. అయితే ఆయన మాత్రం తను దర్శకత్వం వహించాలనుకున్న సినిమా కోసం మాత్రమే కథను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాధానమిస్తున్నాడట.
అల్లు అర్జున్ తో మంచి సాన్నిహిత్యం వున్న కారణంగా, దర్శకుడిగా తనకి మరో ఛాన్స్ ఇవ్వమని వక్కంతం వంశీ అడిగినట్టు చెబుతున్నారు. కథ నచ్చితే అప్పుడు ఆలోచన చేద్దామని అల్లు అర్జున్ అనడంతో, ఆయనకి కథను వినిపించే పనిలో వంశీ ఉన్నాడని అంటున్నారు. మరి అల్లు అర్జున్ వంశీ మాట కాదనలేక అలా అన్నాడా? లేదంటే నిజంగానే అవకాశం ఇస్తాడా? అనేది వేచి చూడాలి.