అమ్మ లగ్జరీ కారు కొనివ్వలేదని, మరో కారు నడుపుకుంటూ రోడ్డు మీదకు వచ్చేసిన బుడతడు!
- యూఎస్ లోని లాస్ ఏంజిల్స్ సమీపంలో ఘటన
- డ్రైవర్ కనిపించకుండా కారు వెళ్లడంతో వెంబడించిన పోలీసులు
- కొత్త కారు కొనేందుకు మూడు డాలర్లతో బయలుదేరిన చిన్నారి
వాడు బుడిబుడి అడుగులు వేసే ఐదేళ్ల చిన్నారి. ఇంట్లో వాళ్ల అమ్మను లాంబోర్గినీ లగ్జరీ కారు కొనాలని మారాం చేశాడు. అందుకు అమ్మ ఒప్పుకోలేదని గొడవపడి, ఇంట్లో ఉన్న మరో కారు వేసుకుని, పారిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ పరిధిలో జరిగింది. పోలీసులే అవాక్కైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
ఉతాహ్ హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు, డ్రైవర్ లేకుండా వెళుతూ ఉన్న ఓ కారు కనిపించింది. దీంతో వెంటనే పోలీసులు ఆ కారును ఫాలో చేసి, ఆపారు. ఆపై కారులో ఉన్న డ్రైవర్ ను చూసి నోరెళ్లబెట్టారు. అతను ఐదేళ్ల చిన్నారి. తాను అమ్మతో గొడవ పడ్డానని, తనకు నచ్చిన కారును ఆమె కొనివ్వలేదని, దీంతో కాలిఫోర్నియాకు వెళ్లి, తానే కారును కొనాలని నిర్ణయించుకుని వచ్చానని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు, ఎంత డబ్బు తెచ్చావని ప్రశ్నించగా, మూడు డాలర్లు చూపించాడు.
ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన పోలీసులు, ఇంట్లోని స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ తో బాలుడు వచ్చాడని చెబుతూ, డ్యాష్ కామ్ వీడియోను విడుదల చేశారు. కారును ఆపిన తరువాత తాను వెనుక వైపున్న అద్దం నుంచి చూస్తే డ్రైవర్ కనిపించక పోవడంతో ఆశ్చర్యపోయానని, డ్రైవర్ మందుమత్తులో వున్నాడనుకున్నానని, ముందుకు వచ్చి చూసి అవాక్కయ్యానని పోలీసు అధికారి రిక్ మోర్గాన్ వెల్లడించారు. ఇంటి నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే అతన్ని ఆపామని తెలిపారు. ఆపై మరోసారి ఇటువంటి పనులు చేయవద్దని మందలించి, తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు.