నేడు ఉదయం 10 గంటలకు తెరచుకోనున్న తెలంగాణ మద్యం దుకాణాలు

  • కేంద్ర నిర్ణయం మేరకు నిబంధనల సవరణ
  • సాయంత్రం 6 గంటల వరకూ అమ్మకాలు
  • భౌతిక దూరం, మాస్క్ లు తప్పనిసరని ఆదేశం
కేంద్ర ప్రభుత్వ సూచనలు, నిర్ణయాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోనూ తక్షణమే మద్యం అమ్మకాలను పునఃప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి 9.30 గంటల వరకూ దాదాపు 7 గంటల పాటు జరిగిన సుదీర్ఘ క్యాబినెట్ సమావేశం అనంతరం, జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని కేసీఆర్ వెల్లడించారు.

బుధవారం ఉదయం 10 గంటల నుంచి షాపులను తెరుస్తామని ఆయన అన్నారు. సాయంత్రం 6 గంటల వరకూ షాపులు తెరచుకోవచ్చని, షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరని, మాస్క్ లేకుంటే మద్యం విక్రయించేందుకు అనుమతి లేదని, ఈ బాధ్యత దుకాణాల యజమానులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. రెడ్ జోన్లలోనూ అమ్మకాలు కొనసాగుతాయని, కంటైన్ మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దాదాపు 15 మద్యం దుకాణాలను మాత్రం తెరిచేది లేదని వ్యాఖ్యానించారు.


More Telugu News