జగన్ మాటలతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయాయి: పవన్

  • కరోనాను కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైంది
  • తెలంగాణతో పోలిస్తే బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోయింది
  • వైసీపీ నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు
కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ... మహమ్మారిని కట్డడి చేయడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే... ఏపీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోయిందని అన్నారు.

వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని... ర్యాలీలు నిర్వహించడం, బహిరంగ కార్యక్రమాలను చేపట్టడం వంటివి చేస్తున్నారని పవన్ విమర్శించారు. ఈరోజు జనసేన-బీజేపీ అగ్రనాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై ఈ సందర్భంగా చర్చించారు.


More Telugu News