దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 46,711

  • యాక్టివ్ కేసులు 31,967
  • డిశ్చార్జి అయిన వారు 13,160
  • మృతి చెందిన వారి సంఖ్య1,583
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 46,711కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఓ ప్రకటన చేసింది. నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 31,967, మృతుల సంఖ్య 1,583, డిశ్చార్జి అయిన వారు 13,160 మంది కాగా మైగ్రేటెడ్ ఒకటిగా పేర్కొంది.
 
 కొన్ని రాష్ట్రాల నుంచి సరైన సమయానికి వివరాలు రావట్లేదు: లవ్ అగర్వాల్

‘కరోనా’ కేసులకు సంబంధించిన వివరాలు కొన్ని రాష్ట్రాల నుంచి సరైన సమయానికి రావడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇతర రోగాలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలను కొనసాగించాల్సిన అవసరం ఉందని, అత్యవసర కేసులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చూడాలని ఆదేశించారు. కార్యాలయాలు ప్రారంభించే వారంతా తమ కార్యాలయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కచ్చితంగా చేపట్టాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.


More Telugu News