టీమిండియా బౌలింగ్ కోచ్ పదవిపై ఆసక్తి చూపుతున్న పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్
- అవకాశం వస్తే భారత బౌలింగ్ కోచ్ గా వెళతానంటున్న అక్తర్
- భారత బౌలర్లలో దూకుడు పెంచుతానని వెల్లడి
- ఐపీఎల్ లోనూ కోచ్ గా అడుగుపెట్టేందుకు ఆసక్తి
సిసలైన ఫాస్ట్ బౌలింగ్ కు పర్యాయపదంలా నిలిచే షోయబ్ అక్తర్ ప్రస్తుతం తన యూట్యూబ్ చానల్ లో నిత్యం సందడి చేస్తుంటాడు. ఒకప్పుడు తన వాడీవేడి బౌన్సర్లతో బ్యాట్స్ మెన్ కు నరకం చూపించిన ఈ పాకిస్థాన్ స్పీడ్ స్టర్ ఇప్పుడు కోచింగ్ పై ఆసక్తి చూపిస్తున్నాడు.
తాజాగా, ఓ సోషల్ మీడియా చాట్ లో అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. మున్ముందు అవకాశం వస్తే భారత్ బౌలింగ్ కోచ్ గా పనిచేస్తారా అని ప్రశ్నించగా, తప్పకుండా పనిచేస్తానని, టీమిండియా బౌలింగ్ కోచ్ గా పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరాల్లేవని స్పష్టం చేశాడు. తన బౌలింగ్ పరిజ్ఞానాన్ని వారికీ అందిస్తానని, భారత బౌలర్లను మరింత దూకుడైన బౌలర్లుగా తీర్చిదిద్దుతానని తెలిపాడు. అంతేకాదు, ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో కోచ్ గా కలిసి పనిచేయాలనుందని తన మనసులో మాట వెల్లడించాడు.