మంత్రగత్తెలుగా అనుమానించి ముగ్గురు మహిళలపై దాష్టీకం!
- బిహార్, ముజఫర్‌పూర్‌లోని దక్రామా గ్రామంలో ఘటన
- మంత్రగత్తెలుగా అనుమానం
- ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలు
- దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ముగ్గురు మహిళలను అర్ధనగ్నంగా స్థానికులు ఊరేగించిన దారుణ ఘటన బిహార్‌లో కలకలం రేపింది. ముజఫర్‌పూర్‌లోని దక్రామా గ్రామంలో స్థానికులు పాల్పడ్డ ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన జరుగుతున్న సమయంలో వారు వీడియోలు కూడా తీశారు. దీంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి మీడియాకు వివరాలు తెలిపారు.
దక్రామా గ్రామంలో ముగ్గురు మంత్రగత్తె లు తమకు సమస్యలు సృష్టిస్తున్నారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. వారికి బుద్ధి చెబుతామంటూ అంతా ఆ ముగ్గురు మహిళల వద్దకు వచ్చి వారిని నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి, అర్ధనగ్నంగా వీధుల్లో తిప్పారు. ఆ సమయంలో వారిని అంతా కలిసి కొట్టడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు నేరపూరిత చర్యకు పాల్పడ్డారని, విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.