భారత్ కు వ్యతిరేకంగా దాడులు చేయాలంటూ అల్ ఖైదా ప్రకటన

  • యెమెన్ లో ప్రకటన విడుదల చేసిన ‘అల్ ఖైదా’
  • కశ్మీర్ లోని ఉగ్రవాదులు దాడులకు పాల్పడాలి
  • భారత ముస్లింలు ఇస్లామిస్ట్ జీహాద్ లో పాల్గొనాలి
భారత్ కు వ్యతిరేకంగా దాడులు చేసేందుకు నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా కుట్ర పన్నుతోంది. భారత్ పై దాడులు చేయాలంటూ కశ్మీర్ లోని ఉగ్రవాదులకు పిలుపునిచ్చింది. అల్ ఖైదాలోని విభాగం అల్ ఖైదా అరబ్ పెవిన్సులా (ఏక్యూఏపీ) యెమెన్ లో  ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇస్లామిస్ట్ జీహాద్ లో పాల్గొనాలని భారత ముస్లింలను కోరినట్టు ఈ ప్రకటన ద్వారా తెలుస్తోంది. భారత ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఏక్యూఏపీ ఆరోపించింది. ఇదిలా ఉండగా, భారత్ లో ముస్లింలకు అన్యాయం జరుగుతోందంటూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ), కువైట్ ప్రభుత్వం, కొన్ని అరబ్ సంస్థలు ఇటీవలే ఆరోపించాయి. ఈ ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే అల్ ఖైధా ఈ ప్రకటన చేసింది.


More Telugu News