మా అమ్మ, నాన్న విడిపోవడం నా వరకూ సంతోషకరమైన విషయమే: శ్రుతి హాసన్ వ్యాఖ్యలు
- అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు విడిపోవడమే మంచిది
- మొదట వారిని కలపాలని అనుకున్నాను
- విడిపోయాక వారు ప్రశాంతంగా ఉన్నారు
- లేదంటే గొడవపడుతూ ఉండేవారు
అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిదని అంటోంది హీరోయిన్ శ్రుతి హాసన్. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. జంటల మధ్య విభేదాలు రావడం, విడిపోవడం వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంది.
విభేదాలతో కలిసి జీవించే కంటే విడిపోవడం మంచిదని చెబుతూ, అందుకు ఉదాహరణగా తన తల్లిదండ్రుల విషయాన్ని ప్రస్తావించింది. తన అమ్మ, నాన్న విడిపోవడం తన వరకూ సంతోషకరమైన విషయమేనని వ్యాఖ్యానించింది. ఎందుకంటే తన పేరెంట్స్ ఇద్దరూ కళాకారులేనని, వారు పరస్పరం గొడవ పడుతూ మనశ్శాంతి లేకుండా జీవించడం కంటే విడిపోవడమే మంచిదని తెలిపింది.
అలా వారి జీవితాలను సంతోషంగా గడపడమే ఉత్తమమని తెలిపింది. వారిద్దరూ విడిపోవడం కష్టంగా ఉన్నప్పటికీ వారు కలిసి జీవించినప్పుడు పలు సమస్యలు వచ్చేవని ఆమె తెలిపింది. తాను వాటిని ప్రత్యక్షంగా చూశానని చెప్పింది. తాను మొదట్లో తన తల్లిదండ్రులను కలపాలని అనుకున్నానని తెలిపింది.
అయితే, వారు మళ్లీ కలిస్తే ఒకరిపై ఒకరు గొడవలు పడి మనశ్శాంతికి దూరం అవుతారని తనకు అనిపించిందని చెప్పింది. అందుకే తాను ఇక ఆ ప్రయత్నం చేయలేదని తెలిపింది. ప్రస్తుతం వారిద్దరు మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారని చెప్పింది.