టెస్టింగ్ కిట్ల డొల్లతనం... బొప్పాయి పండుకు కరోనా పాజిటివ్ చూపించిన వైనం!

  • టెస్టింగ్ కిట్లలో బయటపడిన డొల్లతనం
  • గొర్రెలోనూ కరోనా వైరస్ ను చూపించిన కిట్
  • దర్యాఫ్తునకు ఆదేశించిన అధ్యక్షుడు
కరోనా పరీక్షలకు వాడుతున్న కిట్లు ఎంత డొల్లతనంగా ఉన్నాయన్న విషయాన్ని రుజువులతో సహా పసిగట్టిన టాంజానియా, దిగుమతి చేసుకున్న మొత్తం కిట్ల వాడకాన్ని నిషేధించింది. వివరాల్లోకి వెళితే, ఇటీవల కరోనా వైరస్ పరీక్షా కిట్లను టాంజానియా దిగుమతి చేసుకోగా, వీటితో గొర్రెలు, బొప్పాయి పండ్లు, మేకలపైనా పరీక్షించారు.

ఓ గొర్రెలోను, బొప్పాయి పండులోను కరోనా వైరస్ ఉందని ఈ టెస్టింగ్ కిట్లు నిర్ధారించాయి. దాంతో వీటిల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు. దీంతో మొత్తం కిట్ల వాడకాన్ని తక్షణం నిలిపివేయాలని దేశ అధ్యక్షుడు జాన్ మగుపులి ఆదేశాలు జారీ చేశారు. ఈ కిట్లతో పరీక్షలు చేస్తే, కొంతమంది కరోనా బాధితుల్లో వైరస్ లేదని వచ్చిందని అన్నారు. తదుపరి దర్యాఫ్తునకు ఆయన ఆదేశించారు. కాగా, టాంజానియాలో ఇప్పటివరకూ 480 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 17 మంది మరణించారు.


More Telugu News