విరాళాల సేకరణకు నటి శ్రియ శ్రీకారం.. రూ.200 చెల్లిస్తే ఆమెతో కలిసి డ్యాన్స్ చేసే ఛాన్స్!
- విరాళాల సేకరణకు రెండు సంస్థలతో కలిసి పనిచేస్తున్న శ్రియ
- రూ. 200 చెెల్లిస్తే రిజిస్ట్రేషన్
- శనివారం వరకు మాత్రమే చాన్స్
భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో నివసిస్తున్న నటి శ్రియ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన శ్రియ ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.200 చెల్లించి తనతో కలిసి (వీడియో కాల్ ద్వారా) డ్యాన్స్, యోగా చేయవచ్చంటూ ఆఫర్ ప్రకటించారు. శనివారం సాయంత్రం వరకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.
కోవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు ‘ది కైండ్‌నెస్ ఫౌండేషన్, చెన్నై టాస్క్‌ఫోర్స్ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పిన శ్రియ.. దినసరి కూలీలు, నిరాశ్రయులైన వృద్ధులు, వికలాంగులు, అనాథల కోసం విరాళాలు సేకరించబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు విజేతలను ఎంపిక చేస్తామని, వారు తనతో కలిసి డ్యాన్స్, యోగా చేయొచ్చని వివరించారు.
ఇందుకోసం www.thekindnessproject.in వెబ్ సైటులో రూ.200 విరాళంగా చెల్లించి రిసిప్ట్‌ను ఈమెయిల్ చేయాలని శ్రియ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 8 గంటల వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని, ఆదివారం విజేతల్ని ప్రకటించి, వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఓ మంచి పనికోసం అందరం కలిసి రావాలని శ్రియ పిలుపునిచ్చారు.