కర్ణాటకలో తొలి రోజు రూ. 45 కోట్ల మద్యం అమ్మకాలు

  • మద్యం దుకాణాల ముందు పెద్ద ఎత్తున బారులు
  • బెంగళూరులో క్యూలలో మహిళలు
  • రాష్ట్రవ్యాప్త అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ లెక్కలు
లాక్‌డౌన్ కారణంగా చాలా రోజులపాటు ఉగ్గబట్టుకుని కూర్చున్న మందుబాబులు ఇక ఆగలేకపోయారు. దుకాణాలు ఇలా తెరిచారో, లేదో, అలా ఎగబడ్డారు. మద్యం కొనుగోళ్లకు పోటెత్తారు. కర్ణాటకలో అయితే తొలి రోజు ఏకంగా రూ. 45 కోట్ల మద్యాన్ని గుటుక్కుమనిపించారు.

లాక్‌డౌన్ మూడో దశలోకి ప్రవేశించిన నేపథ్యంలో కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో యడియూరప్ప ప్రభుత్వం నిన్న గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచింది. దీంతో ఉదయం నుంచి వైన్ షాపుల ముందు కిలోమీటర్ల మేర బారులు కనిపించాయి. బెంగళూరులో అయితే కొన్ని వైన్ షాపుల ఎదుట మహిళలు కూడా పెద్ద ఎత్తున క్యూలో ఓపిగ్గా నిల్చుని మద్యం కొనుగోలు చేశారు. మద్యం అమ్మకాలు ముగిసిన తర్వాత గత రాత్రి ఎక్సైజ్ శాఖ ప్రకటన చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 45 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్టు తెలిపింది.


More Telugu News