ఏపీలో తొలిరోజు మద్యం విక్రయాల అంచనా రూ.40 కోట్లు!

  • ఇవాళ రాత్రి ఏడు గంటలతో ముగిసిన మద్యం విక్రయాలు
  • ప్రకాశం  మినహా రాష్ట్ర వ్యాప్తంగా తెరచుకున్న దుకాణాలు
  • 2,345 మద్యం దుకాణాల ద్వారా మద్యం విక్రయం
ఏపీలో తొలిరోజు మద్యం విక్రయాలు ఇవాళ రాత్రి ఏడు గంటలతో ముగిశాయి. తొలిరోజు   రూ.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు అంచనా. ఏపీలో అధికారికంగా మొత్తం 3,468 దుకాణాలు ఉన్నాయి. ఈ రోజు 2,345 మద్యం దుకాణాలను తెరిచారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో మాత్రం మద్యం దుకాణాలు తెరవలేదు.

కాగా, ఈ రోజు ఉదయం 11 గంటలకు మద్యం షాపులు తెరిచి రాత్రి  7 గంటల వరకు విక్రయాలు కొనసాగించారు. మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. ఏపీ, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లోని మద్యం దుకాణాల వద్దకు తమిళనాడు వాసులు రావడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొనడంతో ఆయా దుకాణాల్లో మద్యం విక్రయాలను అధికారులు నిలిపివేశారు.


More Telugu News