లాక్ డౌన్ ఎఫెక్ట్.. సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా!
- ఈ నెల 31న నిర్వహించాల్సి ఉన్న ప్రిలిమినరీ పరీక్షలు
- ఈ మేరకు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన
- తిరిగి ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామన్న అధికారులు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించాల్సి వున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా ఈ నెల 31న నిర్వహించాల్సి ఉన్న ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు యూపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో నోటీసు జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
కాగా, యూపీఎస్సీ చైర్మన్ అరవింద్ సక్సేనా నేతృత్వంలో బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించారు. లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.